నష్టం మిగిల్చిన వాన.. | - | Sakshi
Sakshi News home page

నష్టం మిగిల్చిన వాన..

Apr 17 2025 12:29 AM | Updated on Apr 17 2025 12:29 AM

నష్టం

నష్టం మిగిల్చిన వాన..

కొణిజర్ల: మండల కేంద్రంతో పాటు పెద్దగోపతి, పెద్దమునగాల, కాచారం, కొండవనమాల తదితర గ్రామాల్లో వరి పంట వర్షం, ఈదురుగాలులకు నేలకొరిగింది. గింజ పాలు పోసుకునే దశలో ఈ పరిస్థితి ఎదురవడంతో సగానికి పైగా దిగుబడి తగ్గుతుందని వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో నీటి సరఫరా నిలిపివేయడంతో ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు ప్రకృతి మరింత కన్నెర్ర చేసింది.

వేంసూరు: మండలంలో వర్షం కారణంగా ధాన్యం రాశులపై కప్పిన పట్టాలపై నీరు నిలవగా ఆరబెట్టిన ధాన్యం తడవడంతో పాటు మామిడి కాయలు నేలరాలాయి.

తిరుమలాయపాలెం: మండలంలోని ఎదుళ్లచెరువు, జింకలగూడెం, పిండిప్రోలు, కొక్కిరేణి, బీరోలు తదితర గ్రామాల్లో పంటలు తడిసిముద్దయ్యాయి. ధాన్యం, మిర్చి, మొక్కజొన్న రాశులు తడిశాయి. తద్వారా మిర్చి రంగు మారుతుందని, మొక్కజొన్న నాణ్యత తగ్గనున్నందున ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

తల్లాడ: మండలంలో వర్షంతో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. తల్లాడ, రేజర్ల, గొల్లగూడెం, బిల్లుపాడు, అన్నారుగూడెం, మల్లవరం, తెలగవరం, నూతనకల్‌, మిట్టపల్లిల్లో తేమ శాతం వచ్చినా కాంటా వేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. ఇక మామిడి తోటల్లో కాయలు గాలివానకు రాలాయి.

పెనుబల్లి: మండలంలోని లింగగూడెం, ఏరుగట్ల, భవన్నపాలెం, చౌడవరం, పార్థసారథిపురం తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వరి నేలమట్టమైంది. చేతికొచ్చిన పంట నేలపాలైనందున తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నేలకొండపల్లి: మండలంలోని నేలకొండపల్లి, చెరువుమాధారం, మంగాపురం, ముజ్జుగూడెం, పైనంపల్లిల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. ధాన్యం కాంటా వేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.

కూసుమంచి: మండలంలోని పలు గ్రామాల్లో వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో బుధవారం ఉదయం నుంచే రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి తీసుకొచ్చిన మిర్చి బస్తాలను తడవకుండా రైతులు టార్పాలిన్‌ కవర్లు కప్పి రక్షించుకున్నారు.

వైరారూరల్‌: గరికపాడు, దాచాపురంలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులు తడిచాయి. కొన్నిచోట్ల రైతులు ముందుగానే కప్పిన పట్టాలపైనా నీరు నిలిచింది.

ముదిగొండ: పలు గ్రామాల్లో వర్షంతో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.

రఘునాథపాలెం: కొత్తగూడెం, ధంసలాపురం, గోపాలపురం, గణేశ్వరం, చింతగుర్తి తదితర గ్రామాల్లో వరితో పాటు మొక్కజొన్న, బొప్పాయి, మామిడి తోటలకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు.

నష్టం మిగిల్చిన వాన..1
1/7

నష్టం మిగిల్చిన వాన..

నష్టం మిగిల్చిన వాన..2
2/7

నష్టం మిగిల్చిన వాన..

నష్టం మిగిల్చిన వాన..3
3/7

నష్టం మిగిల్చిన వాన..

నష్టం మిగిల్చిన వాన..4
4/7

నష్టం మిగిల్చిన వాన..

నష్టం మిగిల్చిన వాన..5
5/7

నష్టం మిగిల్చిన వాన..

నష్టం మిగిల్చిన వాన..6
6/7

నష్టం మిగిల్చిన వాన..

నష్టం మిగిల్చిన వాన..7
7/7

నష్టం మిగిల్చిన వాన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement