మూడు, రెండేసి బిన్లతో చెత్త డబ్బాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చడంపై అధికారులు దృష్టి సారించారు. వాణిజ్య, నివాస ప్రాంతాల్లో రోజువారీ చెత్త సేకరణ జరుగుతున్నా కొందరు మాత్రం వ్యర్థాలను రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. దీన్ని అరికట్టేలా చెత్త డబ్బాల ఏర్పాటుకు నిర్ణయించారు. కమర్షియల్ ప్రాంతాల్లో మూడు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో రెండు బిన్లతో కూడిన డబ్బాలు ఏర్పాటుచేయనుండగా, ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. వీటి ఏర్పాటుకు పలు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు.
120 ప్రాంతాల్లో ఏర్పాటు
రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో ఎక్కువగా చెత్త వేస్తున్న ప్రాంతాలను అధికారులు గుర్తించగా.. 120 ప్రాంతాల్లో డబ్బాలు ఏర్పాటు చేయనున్నారు. అరవై ప్రాంతాల్లో మూడు, 60 ప్రాంతాల్లో రెండు బిన్లతో కూడిన ఏర్పాటుచేస్తారు. కమర్షియల్ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తతో పాటు హానికరమైన వ్యర్థాలు ఏర్పాటుచేసేందుకు మూడు బిన్లతో కూడిన డబ్బాలు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తడి, పొడి చెత్త సేకరణకు రెండు బిన్లతో కూడిన డబ్బాలు ఉంటాయి. ఈమేరకు నగరానికి చేరిన డబ్బాలను కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా శుక్రవారం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. తొలుత 40 ప్రాంతాల్లో, దశల వారీగా మిగిలిన 80 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనుండగా, ఇందులోనే చెత్త వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు


