10,629 మె.టన్నుల ధాన్యం కొనుగోలు
కూసుమంచి/తిరుమలాయపాలెం: జిల్లాలో ఏర్పాటుచేసిన కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 10,629 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని డీఎస్‌ఓ చందన్‌కుమార్ తెలిపారు. కూసుమంచి మండలం పాలేరు, తిరుమలాయపాలెం మండలంలోని బీరోలులో కొనుగోలు కేంద్రాలు, జుజుల్‌రావుపేట వద్ద కాంటా వేసిన ధాన్యాన్ని ఆయన శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయడమే కాక రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు కాంటా వేయించి మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 8,646.520మెట్రిక్ టన్నులు సన్నధాన్యం, 1,982.240మెట్రిక్ టన్నులు సాధారణ రకాలు ఉన్నాయని చెప్పారు. సన్నధాన్యం అమ్మిన రైతుల్లో ఇప్పటివరకు 115 మందికి రూ.54.32 లక్షల బోనస్ జమ అయిందని తెలిపారు.
నేడు అవగాహన సదస్సు
ఖమ్మం సహకారనగర్: గ్రామ పాలన ఆఫీసర్లు(జీపీఓ)గా విధులు నిర్వర్తించేందుకు ఆప్షన్ ఇచ్చిన వీఆర్వో, వీఆర్‌ఏలకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌రావు తెలిపారు. ఖమ్మం డీపీఆర్‌సీ భవనంలో ఉదయం 10గంటలకు ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రామ పాలన ఆఫీసర్లుగా విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నందున అందరూ హాజరుకావాలని సూచించారు.
రిటైనింగ్ వాల్
భూముల్లో ట్రెంచ్
ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా నిర్మించే రిటైనింగ్ వాల్ సంబంధించి భూసేకరణ చివరిదశకు చేరడంతో హద్దుల ప్రకారం కందకం తవ్వే పనులు శుక్రవారం మొదలుపెట్టారు. ప్రైవేట్ భూముల యజమానుల అంగీకారం మేరకు బుర్హాన్‌పురం, రామకృష్ణ ఆశ్రమ పరిసరాల్లో జలవనరులశాఖ ఆధ్వర్యాన ట్రెంచ్ పనులు సాగించారు. అయితే, ఆటోనగర్ ప్రాంతాని కి చెందిన కొందరు ప్లాట్ల యజమానులు అక్కడకు చేరుకుని తమకు న్యాయం చేసేవరకు పనులు మొదలు పెట్టవద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమాచారంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయగా తవ్వకం పనులు సాగించారు.
10,629 మె.టన్నుల ధాన్యం కొనుగోలు


