ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కూసుమంచి: అకాల వర్షాల నేపథ్యాన ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మండలంలోని పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేసిన ఆయన వివరాలు ఆరా తీసి మాట్లాడారు. రైతులు ధాన్యం తీసుకురాగానే నాణ్యత ఆధారంగా కాంటా వేయించడమే కాక ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. రైతులు వేచిఉండకుండా మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. అనంతరం కేంద్రంలోని ప్యాడీ క్లీనర్ పనితీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, సంస్థ మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


