నేడు, రేపు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆది, సోమవారాల్లో మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధిర మండలం సిరిపురంలో రూ.11.37 కోట్లతో నిర్మించే ఐటీఐ భవనం, రూ.4.71 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యాం, రూ.5కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనాలకు ఆదివారం ఉద యం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మధ్యాహ్నం రూ.12.14 కోట్లతో నిర్మించిన మహాదేవపురం లిఫ్ట్‌ను ప్రారంభించాక రూ.19 కోట్లతో నిర్మించే రాయపట్నం ఎత్తిపోతల పథకం, మధిర నుండి నిదానపురం మీదుగా ములుగుమాడు రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6గంటలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిర్యాల రమణగుప్తా ఒక ప్రకటనలో కోరారు.
రేపు మెగా జాబ్‌మేళా
మధిరలోని రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించే జాబ్‌మేళాను డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభిస్తారు. ఎనభై కంపెనీల బాధ్యులు హాజరుకానుండగా, దాదాపు 5వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా డిప్యూటీ సీఎం సూచనలతో జాబ్‌మేళా ఏర్పాటుచేస్తున్నారు.
ఆదాయ లక్ష్యాలు
చేరుకోవాలి
ఖమ్మంక్రైం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ అధికారులు లక్ష్యాల మేర పన్నులు రాబట్టాలని శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం వీసీ ద్వారా మాట్లాడిన ఆయన వాహనాలు, చెక్‌పోస్ట్‌ల ద్వారా పన్నులు వసూలు చేయాలని తెలిపారు. వీసీకి ఖమ్మం ఇన్‌చార్జ్ డీటీఓ, భద్రాద్రి డీటీఓ వరప్రసాద్, వెంకటరమణ హాజరయ్యారు.
విద్యాసంస్థలో రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు
జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటుచేయాలని రోడ్డు సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్రిన్ సిద్ధిఖీ సూచించారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో విద్యాసంస్థల బాధ్యులతో సమావేశమైన ఆమె విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా క్లబ్‌లు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి డీటీఓలు వరప్రసాద్, వెంకటరమణ ఉద్యోగులు శ్రీనివాస్, స్వర్ణలత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్‌లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివా రం వెల్లడించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి విద్యార్థుల పరీక్ష ఫీజును యూనివర్సిటీకి చెల్లించకపోగా, నామి నల్ రోల్స్ కూడా పంపలేదు. దీంతో పరీక్షలను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని రాజేందర్ శనివా రం ఓ ప్రకటనలో తెలిపారు.


