కళాక్షేత్రం అభివృద్ధికి కృషి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం సాహిత్య రంగానికి కేంద్రంగా విరాజిల్లుతున్న భక్త రామదాసు కళాక్షేత్రం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. నెల నెలా వెన్నెల 93వ కార్యక్రమం ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. కనుమరగవుతున్న నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి నెలా కార్యక్రమాలను నిర్వహించటం అభినందయమన్నారు. ఈ సదర్భంగా హైదరాబాద్ కళాబృందం ప్రదిర్శించిన ‘హక్కు’నాటికను ఎంపీ తిలకించారు. అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ (ఆర్క్స్) అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్మోహన్‌రావు, ఏఎస్ కుమార్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు నాగబత్తిని రవి, కె.దేవేంద్ర, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మెంతుల శ్రీశైలం, మహ్మద్ ముస్తాఫా, రాధాకృష్ణ, జాబిశెట్టి పాపారావు, యాంకర్ రవీందర్, మారుతి కొండల్‌రావు, వీరబాబు, సాయి, శశి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన కార్యక్రమాలు
93వ నెల నెలా వెన్నెల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తొలుత హైదరాబాద్‌కు చెందిన దాశరథి థియేటర్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో లఘుచిత్రాలను ప్రదర్శించారు. ఖమ్మం కళాకారుడు నటించిన ‘అమ్ము’, సినీ నటుడు ఎల్బీ శ్రీరాం నటించిన ‘పసుపు కుంకుమ’లఘు చితాల్రను ప్రదర్శించారు. వడ్డే ఆచరణ కూచిపూడి నృత్యం, నామా ప్రణవికసాయి భరతనాట్యం ఆకట్టుకున్నాయి.
మొక్కజొన్న పంట దగ్ధం
బోనకల్: మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన మలాది అచ్చయ్య నారాయణపురం మైనర్ కాలువ పరిధిలో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల గాలిదుమారానికి మొక్కజొన్న నేలకొరిగింది. కూలీల కొరత ఉండడంతో మొక్కజొన్న కంకులు ఇరవడం ఆలస్యమైంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పక్క పొలాల్లో నిప్పంటించడంతో మంటలు ఈ పంటకు కూడా అంటుకున్నాయి. పంట అంతా కాలి బూడిదవడంతో రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
కళాక్షేత్రం అభివృద్ధికి కృషి
కళాక్షేత్రం అభివృద్ధికి కృషి


