సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. శాఖ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన ఫోన్ ఇన్‌లో పలువురు సమస్యలను విన్నవించగా ఆయన మాట్లాడారు. విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ బిల్లులు హెచ్చుతగ్గులు, లో ఓల్టోజీ సమస్యల తీవ్రత ఆధారంగా కొన్నింటికి వెంటనే, ఇంకొన్ని రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు కంట్రోల్ రూం నంబర్‌కు 94408 11525 ఫోన్ చేయొచ్చని లేదా 1912, 1800 425 0028 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఈలు నంబూరి రామారావు, సీహెచ్.నాగేశ్వరరావు, ఎల్.రాములు, బి.శ్రీనివాసరావు, చిన బాబూరావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.


