రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి, ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదేశించారు. పనులను ముంగళవారం పరిశీ లించిన ఆయన అధికారులతో సమీక్షించారు. మార్చికల్లా పూర్తవుతాయన్న పనులు ఇంకా జరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్ ఫామ్‌పై షెడ్ల పనుల్లో వేగం పెంచి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆతర్వాత ఓ స్టాల్‌లో టీ తాగిన ఎంపీ ‘చాయ్ అచ్చా హై..’ అని నిర్వాహకులను అభినందించారు. ఖమ్మం కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జాఫర్, డిప్యూటీ స్టేషన్ మాస్టర్ అనిల్ కుమార్, ఆర్పీఎఫ్ సీఐ సురేష్ గౌడ్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్, ఎస్‌ఎస్‌సీ అధికారి అఖిల్, కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఎం.డీ.ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
లోక్‌సభ సభ్యుడు రఘురాంరెడ్డి


