జీపీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో రెండు రోజులుగా గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టంతో పాటు కార్యదర్శుల పాత్రపై శిక్షణ ఇచ్చామని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఏవీఆర్.కొండల్‌రావు తెలిపారు. రిసోర్స్‌పర్సన్స్‌గా ఎంపీడీఓలు రోజారాణి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీదేవి, రిటైర్డు ఎంపీడీఓలు అశోక్‌కుమార్‌రెడ్డి, మురహరిరావు వ్యవహరించగా, 26మంది కార్యదర్శులు హాజరయ్యారు.
పది మందికి పోస్టింగ్
ఖమ్మం సహకారనగర్: స్పౌజ్ కేటగిరీలో భాగంగా ఇటీవల చేపట్టిన బదిలీల్లో జిల్లాకు కొత్తగా 10మంది ఉపాధ్యాయులను కేటాయించారు. వీరికి బుధవారం పోస్టింగ్ ఇచ్చినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఏళ్ల తరబడి భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తుండగా ఎట్టకేలకు ఒక చోటకు చేరడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


