ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే గెలుపు
కారేపల్లి: రాష్ట్రంలో మరో మూడేళ్ల తర్వాతైనా, ఇంకా ముందైనా ఎన్నికలు వస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారం, హామీల అమలు కోసం చేసే పోరాటంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమని తెలిపారు. కాగా, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులతో వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అనంతరం వెంకట్యాతండాలో బీఆర్‌ఎస్ నాయకుడు బానోత్ భాస్కర్‌ను పరామర్శించారు. నాయకులు ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, ఆడేపు పుల్లారావు, పిల్లి వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకట అప్పారావు, బత్తుల శ్రీనివాసరావు, బానోత్ రాందాస్‌నాయక్, జూపల్లి రాము పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు


