పహల్గాం దాడిపై కన్నెర్ర
ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మం సహకారనగర్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో కాల్పులు జరిపిన ముష్కరుల తీరుపై ప్రజలు, పార్టీలు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేయగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.కోటేశ్వరరావు, నాయకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్‌కుమార్, నున్న రవికుమార్, వీరూగౌడ్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. టీజీఈ జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యాన టీఎన్జీవోస్ భవన్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనలో కొణిదెన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పి.నాగేశ్వరరావు కోరారు.


