సెగలు కక్కుతున్న సూరీడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాపై భానుడు తన ప్రభావం చూపుతున్నాడు. బుధవారం గరిష్టంగా 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కాగా, మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత, వేడి గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలతో విడుదల చేసిన బులెటిన్‌లో ఖమ్మం కూడా ఉంది. జిల్లాలో గురు, శుక్ర, శనివారాల్లో ఉష్ణోగ్రతలు 41–44 డ్రిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వెల్ల డించిన నేపథ్యాన అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
పెనుబల్లిలో అత్యధికం
జిల్లాలో బుధవారం గరిష్టంగా 43 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత, వేడిగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9గంటల వరకే ఎండ తీవ్రత మొదలై 11 గంటలకల్లా తీవ్రరూపం దాలుస్తోంది. సాయంత్రం 4గంటల వరకు వేడిగాలుల ప్రభావం ఉంటుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ జిల్లా అంతటా ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బుధవారం పెనుబల్లిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, నేలకొండపల్లి, ఎర్రుపాలెంలో 42.9, ఖమ్మం ఖానాపురం, సిరిపురంలో 42.8, వైరా, పమ్మిలో 42.7, చింతకానిలో 42.6, కూసుమంచి, రఘునాథపాలెం, బాణాపురంలో 42.5, పల్లెగూడెంలో 42.4, మధిరలో 42.3, సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో 42.2, మధిర ఏఆర్‌ఎస్‌లో 42.1, రావినూతల, నాగులవంచ 42 ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. అంతేకాక ఖమ్మం ఎన్నెస్పీ, గంగారం తిరుమలాయపాలెంలో 41.8, సదాశివపాలెం, బచ్చోడులో 41.6, ఖమ్మం కలెక్టరేట్ 41.5, వేంసూరు, ఏన్కూరు, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 41.4, పెద్దగోపతిలో 41.3, కల్లూరు, తల్లాడ, కుర్నవల్లి, కాకరవాయి, వైరా ఏఆర్‌ఎస్ 41.1, లింగాల 41, ముది గొండ 40, సత్తుపల్లి, మంచుకొండ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా గుబ్బగుర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జిల్లాలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత
ఈనెల 26వ తేదీ వరకు ఇదే పరిస్థితి
హెచ్చరికలు జారీ చేసిన
వాతావరణ కేంద్రం
సెగలు కక్కుతున్న సూరీడు


