గుర్తుతెలియని వ్యక్తి మృతి
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో రఘునాథపాలెం పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ సభ్యుల చేయూతతో మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
చికిత్స పొందుతున్న మహిళ...
రఘునాథపాలెం: మండలంలోని రేగులచలకు చెందిన దంతాల జ్యోతి(27) కుటుంబ ఘర్షణలతో బుధవారం పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె భర్త మద్యానికి బానిస కావడంతోపాటు కుటుంబ ఘర్షణతో క్షణికావేశానికి గురై పురుగుల మందు తాగింది. ఈమేరకు చికిత్స చేయిస్తుండగా మృతి చెందగా, జ్యోతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
వీఎం బంజర్‌లో...
పెనుబల్లి: మండలంలోని వీఎం బంజర్‌లో రోడ్డు పక్కన గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని కొత్తకారాయిగూడెంకు చెందిన వడ్రంగి నెల్లూరి బోధనాచారి అలియాస్ చంటి(37)గా గుర్తించారు. వడదెబ్బతో ఆయన మృతి చెంది ఉంటారని భావిస్తుండగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు.


