సంక్షేమ గురుకుల విద్యార్థులు భేష్
ఖమ్మంమయూరిసెంటర్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రభు త్వ సంక్షేమ గురుకులా ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్స రం చదివిన పలువురు ప్రైవేట్ విద్యార్థులకు దీటుగా ఫలితాలు సాధించారు. బీసీ గురుకులాలకు సంబంధించి వనంవారి కిష్టాపురం గురుకులం ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి వి.శ్రీచరణ్ 470మార్కులకు 468 మార్కులు సాధించారు. ముదిగొండ మండలం కమలాపురానికి చెందిన ఆయన రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం విశేషం. గ్రామానికి చెందిన శ్రీ చరణ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం విశేషం. కాగా, వనంవారి కిష్టాపురానికి మంజూరైన ఈ గురుకులం ప్రస్తుతం మధిర మండలం కిష్టాపురంలో కొనసాగుతోంది.
●ఎస్సీ గురుకులాలు : జిల్లాలో 11 ఎస్సీ సంక్షేమ శాఖ గురుకులాలు ఉండగా.. మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఓకేషనల్, సీఈసీ, ఎంఈసీలో 956 మందికి గాను 789 మంది(82.53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో పరీక్షలు రాసిన 975 మంది విద్యార్థులకు గాను 900 మంది(92.31 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
●బీసీ గురుకులాలు : బీసీ గురుకులాలు జిల్లాలో 11 ఉండగా.. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 646 మంది హాజరుకాగా 488 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో 344 మందికి 271 మంది ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 660 మందికి 590 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో 337 మందికి 312, బైపీసీ గ్రూపులో 182కు 159 మంది, సీఈసీ గ్రూపులో 84కు 68 మంది, హెచ్‌ఈసీ గ్రూపులో 27 మందికి 21 మంది, ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపులో 30 మందికి 30 మంది ఉత్తీర్ణతతో వంద శాతంగా నమోదైందని వెల్లడించారు.
●మైనారిటీ గురుకులాలు : జిల్లాలో ఏడు మైనార్టీ గురుకులాలు ఉండగా.. మొదటి సంవత్సరంలో 334మంది విద్యార్థులకు 273 మంది(82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 332 మందికి 284 మంది(86 శాతం) ఉత్తీర్ణులయ్యారు.


