వనజీవి ఆశయానికి అనుగుణంగా..
ఖమ్మంరూరల్: ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ ఆయన స్వగ్రామమైన రూరల్ మండలం రెడ్డిపల్లిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేయించిన రామయ్య విగ్రహానికి ఆయన బతికి ఉన్నప్పుడు ధరించినట్లుగా వృక్షో రక్షతి.. రక్షితః అని రాసి ఉన్న బోర్డు అమర్చారు. ఈకార్యక్రమానికి హాజరైన వారికి ఆయన మనవరాలు గౌతమిరమేష్ మూడు వేల జూడ్ బ్యాగ్‌లు, మొక్కలు అందించారు. తన తాత ఆశయాలను కొనసాగిస్తామని ఆమెతో పాటు కుటుంబీకులు తెలిపారు. కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు రామయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
3వేల మొక్కలు పంపిణీ చేసిన రామయ్య మనవరాలు


