రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ కలకలం
ఖమ్మంక్రైం: జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ కలకలం సృష్టించింది. మహబూబాబాద్ ఎంవీఐగా పనిచేస్తూ ఏసీబీకి చిక్కి సస్పెండ్‌లో ఉన్న గౌస్‌పాషాకు చెందిన ఖమ్మంలోని ఇంట్లో అధికారులు సోదా చేశారు. రవాణాశాఖ కార్యాలయానికి కూడా వారు వస్తున్నారనే సమాచారం వైరల్ కావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గౌస్‌పాషా గతంలో ఖమ్మంలో ఎంవీఐగా, ఇన్‌చార్జ్ ఆర్‌టీఓగా కూడా పనిచేశారు. దీంతో ఆయన పనిచేసిన కాలంలో ఫైళ్లను తనిఖీ చేస్తారని పుకార్లు రావటంతో రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. కార్యాలయంలో ఏజెంట్లను ఎవరినీ అనుమతించలేదు. చుట్టు పక్కల ఉన్న దుకాణాల షెట్టర్లకు తాళాలు వేసిన ఏజెంట్లు శుక్రవారం కనిపించకుండా పోయారు. వారిని ఆశ్రయించిన వాహనదారులు లైసెన్స్‌లు, ఆర్‌సీల కోసం ఏజెంట్లను చెట్ల కింద, ఆ ప్రాంతంలో ఉన్న ఇతర దుకాణాల వద్ద పట్టుకుని తమ పని చేయించుకున్నారు. అయితే, బైపాస్‌రోడ్డులోని విజయ్‌నగర్‌కాలనీలో గౌస్‌పాషా ఒక గది మాత్రమే అద్దెకు తీసుకున్నారని, అందులో ఎలాంటి ఆధారాలు ఏసీబీకి లభించలేదని తెలిసింది.
షెట్టర్లకు తాళాలు వేసి కనిపించకుండా
వెళ్లిన ఏజెంట్లు


