పలువురు న్యాయాధికారుల బదిలీ
ఖమ్మం లీగల్ : జిల్లాలో పలువురు న్యాయాధికారులు బదిలీ అయ్యారు. ఖమ్మం అబ్కారీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాళ్లబండి శాంతిలత వికారాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, మధిర ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి టి.కార్తీక్ రెడ్డి వనపర్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. సత్తుపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా హుజూర్‌నగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా వెళ్లగా, ఆ స్థానంలో మిర్యాలగూడ నుంచి బి. సాయినాగ సుమబాల వస్తున్నారు, మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి వేముల దీప్తి రానున్నారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా జడ్జికి తీర్మాన పత్రాలు..
ఇటీవల విజయవాడలో ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ–బాధ్యత’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆమోదించిన తీర్మానపత్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు తెలంగాణ రాష్ట్ర న్యాయవా ద పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశా రు. పరిషత్ జిల్లా అధ్యక్షుడు హర్కారా శ్రీరాంరా వు, సుగ్గల వెంకటగుప్త, శేషాద్రి శిరోమణి, నరేష్, కిషోర్‌బాబు, వెంకటరమణ పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ పరీక్ష
కేంద్రాల వద్ద బందోబస్తు
ఖమ్మక్రైం: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈనెల 27 పరీక్ష జరగనున్న నేపథ్యాన కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని, సమీప ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, మైకులు, డీజేలతో ఊరేగింపులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. అంతేకాక సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్‌షాపులు, స్టేషనరీ షాప్‌లు మూసివేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలుఅతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి : సీపీ
నేలకొండపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు.మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీ లించారు. అనంతరం రాజేశ్వరపురంలోని అరుణాచల రైస్‌మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణా, కాంటాలు, బిల్లులు తదిత ర అంశాలపై రైతులతో మాట్లాడారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మిల్లర్లకు సూచించారు. ఆయన వెంట కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్సై సంతోష్ ఉన్నారు.
రైతులు నష్టపోకుండా చూస్తాం
ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
వేంసూరు: పామాయిల్ సాగులో ఆఫ్ టైప్ మొక్కల నివారణ చర్యలు చేపట్టి రైతులకు నష్టం కలుగకుండా చర్యలు చేపడతామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని వైఎస్‌బంజర్, ఎర్రగుంటపాడు, చోడవరం గ్రామాల్లో శుక్రవారం ఆయన పామాయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆఫ్ టైప్ మొక్కలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, పామాయిల్ సాగుపై ఆసక్తి కొల్పోతున్నారని, దీనిపై నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. నర్సరీ నిర్వహణ, మొక్కల పెంపకంపై సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే నాణ్యత లేని మొక్కలు వచ్చి ఉంటాయని అన్నారు. లోపాలను అధిగమించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొంటుందని, కోతల బెడద ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగే లాభదాయకమని వివరించారు. ఈ పంట సాగులో జిల్లా రైతులు ముందంజలో ఉన్నారని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అనుసరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ శాస్త్రవేత్త బీఎన్ రావు, ఆయిల్‌ఫెడ్ జీఎం సుధాకర్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, అశ్వారావు పేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కళ్యాణ్, ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు ఉమామహేశ్వరెడ్డి, గొర్ల రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలువురు న్యాయాధికారుల బదిలీ


