
తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి
కామేపల్లి: అవసరానికి సరిపడా యూరియా దొరకదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. ఈ ప్రచారంతో కొందరు రైతులు యూరియా నిల్వ చేస్తున్నారనే సమాచారం ఉందని తెలిపారు. జిల్లాలో సరిపడా యూరియా పంపిణీ చేయనున్నందున ఎవరూ ఆందోళనకు గురికావొద్ద ని చెప్పారు. కామేపల్లి మండలం ముచ్చర్ల రైతు వేదికలో శుక్రవారం యూరియా పంపిణీని పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. పంటల సాగు కు అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతోందని, అయినా కొరతపై తప్పుడు ప్రచారంతో కొందరు నిల్వ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాకాకుండా అవసరం మేరకే తీసుకోవాలని డీఏఓ సూచించా రు. ఏఓ భూక్యా తారాదేవి, ఏఈఓ దీపక్‌రెడ్డి, ఇల్లెందు మార్కెట్ డైరెక్టర్ గుగులోత్ గబ్రూనాయక్, పీఏసీఎస్ సీఈఓ గాదె నాగయ్య, సిబ్బంది సత్యనారాయణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.