ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి 26న ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి 26న ఇంటర్వ్యూలు

Sep 20 2025 6:22 AM | Updated on Sep 20 2025 6:26 AM

ఖమ్మం సహకారనగర్‌: ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల బోధనకు అవసరమైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి ఈనెల 26వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌, డీఈఓ శ్రీజ తెలిపారు. ఖమ్మం, కల్లూరు ఆర్‌డీఓ కార్యాలయాల్లో జరిగే ఇంటర్వ్యూకు అభ్యర్థులు బయోడేటా, విద్యార్హతలు, స్థానికత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగానికి 18–44 ఏళ్ల వయస్సు కలిగి స్థానికులై ఉండాలని, నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుందని తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్లుగా ఇంటర్‌ ఆపై విద్యార్హత, ఆయాలుగా 7వ తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని వెల్లడించారు.

లఢాక్‌ మారథాన్‌లో

జిల్లా వాసి సత్తా

ఖమ్మం స్పోర్ట్స్‌: నడి వయస్సులోనూ మారథన్‌లో రాణించాలనే సంకల్పంతో నిత్యం ప్రాక్టీస్‌ చేసిన ప్రభుత్వ ఉద్యోగి జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. ఖమ్మం బీకే.బజార్‌కు చెందిన జీవీ.ప్రసాద్‌ హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 14వ తేదీన లఢాక్‌లో జరిగిన జాతీయస్థాయి మారథాన్‌ రేస్‌లో రాష్ట్ర అగ్నిమాపక శాఖ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా 42.20 కి.మీ. రేస్‌ను అవలీలగా పూర్తి చేసిన ఆయన త్వరలో జరగనున్న 72 కి.మీ. మారథాన్‌కు ఎంకయ్యాడు. లఢాక్‌లోని ఎత్తయిన ప్రదేశాల్లో మారథాన్‌ పూర్తిచేయడం కష్టమైనప్పటికీ వారం ముందుగా వెళ్లి అక్కడి వాతావారణానికి అలవాటు పడడంతో సులువైందని ప్రసాద్‌ తెలిపారు. కాగా, ఆయన ఇప్పటికే కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరిగిన మారథాన్‌ రన్లలో సత్తా చాటి 50కి పైగా పతకాలు సాధించడం విశేషం.

బోధనపై ప్రత్యేక దృష్టి

సత్తుపల్లిటౌన్‌: మైనార్టీ గురుకులాల్లో ప్రభుత్వ ఆదేశాల మెనూ పక్కాగా అమలుచేస్తేనే విద్యాబోధనపై దృష్టి సారించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎండీ.ముజాహిద్‌ సూచించారు. సత్తుపల్లి గుడిపాడులోని తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలను శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. కళాశాల రికార్డులు, తరగతి గదులు, డార్మెటరీలు, వంటశాల పరిశీలించాక ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో సమావేశమయ్యా రు. ఇప్పటివరకు జరిగిన బోధన, పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న తీరుపై తీశాక పలు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్‌ కె.వెంకటరామయ్య, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలు,

పూలతోటలతో లాభాలు

ముదిగొండ: సంప్రదాయ పంటలతో నష్టపోతున్న ఉద్యాన పంటలు, పూలతోటల సాగుతో లాభాల బాట పట్టొచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్‌ తెలిపారు. ముదిగొండ మండలంలోని గోకినేపల్లి, మేడేపల్లి, మాధాపురం గ్రామాల్లో పలువురు రైతులు సాగు చేస్తున్న బంతి, లిల్లీ, గులాబీ తోటలతో పాటు అరటి, ఆయిల్‌పామ్‌ తోటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్లాస్టిక్‌ మల్చింగ్‌ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతులను అభినందించడంతో పాటు తెగుళ్ల నివారణ, డ్రిప్‌ విధానంలో జాగ్రత్తలపై సూచనలు చేశారు. మధిర డివిజన్‌ ఉద్యాన అధికారి విష్టు, రైతులు పాల్గొన్నారు.

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి  26న ఇంటర్వ్యూలు 
1
1/3

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి 26న ఇంటర్వ్యూలు

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి  26న ఇంటర్వ్యూలు 
2
2/3

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి 26న ఇంటర్వ్యూలు

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి  26న ఇంటర్వ్యూలు 
3
3/3

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి 26న ఇంటర్వ్యూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement