
అభివృద్ధి పేరుతో అరాచకాన్ని అడ్డుకుంటాం..
ఎర్రుపాలెం: అభివృద్ధి పేరుతో అరాచకాలు, అక్రమాలకు పాల్పడితే అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. అనుమతి లేని క్వారీల నుండి మట్టి తరలింపును అడ్డుకోవడమేకాక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద నుంచి ఎర్రుపాలెం తహసీల్ వరకు నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నా బాధ్యులపై ఎందుకు తీసుకోవ డం లేదని ప్రశ్నించారు. అభివృద్ధిని తాము స్వాగతిస్తున్నా, అక్రమాలను సహించబోమని తెలిపారు. అనంతరం తహసీల్దార్ ఎం.ఉషాశారదకు వినతిపత్రం అందచేసి కార్యాలయ ఆవరణలోనే భోజ నాలకు సిద్ధం కాగా ఎస్‌ఐ రమేష్ సూచనలతో డెయిరీ ప్రాంగణానికి వెళ్లారు. కాగా, పాదయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు దివ్వెల వీరయ్య, మడుపల్లి గోపాలరావు, మద్దాల ప్రభాకర్, గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లమోతు హన్మంతరావు, బషీరుద్దీన్ అప్పారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రలో సీపీఎం నాయకులు