
సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
చర్ల: భద్రాద్రి జిల్లా చర్లలో సీఆర్‌పీఎఫ్ 81వ బెటాలియన్ ఏర్పాటుకు సీఆర్‌పీఎఫ్ ఐజీ విపుల్‌కుమార్ మంగళవారం స్థల పరిశీలన చేశారు. చర్లలోని సర్వే నంబర్ 117లో బెటాలియన్ కోసం పదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ స్థలం వివరాలను తహసీల్దార్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ బెటాలియన్ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉన్నందున త్వరలోనే ఖరారు చేసి పనులు మొదలుపెడతామని తెలిపారు. ఆపై భద్రతా పరమైన అంశాలపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, స్థానిక పోలీసు అధికారులతో ఆయన చర్చించారు.