యాసంగి పంటలకు సాగునీరు అందించాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
ఆసిఫాబాద్‌అర్బన్: యాసంగిలో ప్రాజెక్టులు, చెరువుల కిందసాగు చేసే పంటలకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సాగునీటి, వ్యవసాయ, విద్యుత్‌శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఈ సీజన్‌లో ఒక ఎకరం కూడా ఎండిపోవద్దని, వచ్చే 15 రోజులు చాలా కీలకమైన సమయమన్నారు. ప్రాజక్టుల నీటితో చెరువులను నింపాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. సాగునీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. తహసీల్దార్, నీటిపారుదల శా ఖ ఏఈ, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకుని తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నూతన మెనూ అమలుపై తనిఖీ నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, డీఏవో శ్రీనివా స్‌రావ్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావ్, నీటిపారుదల శాఖ ఈఈలు ప్రభాకర్, గుణవంత్‌రావ్, డీఆర్‌డీఏ దత్తారాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment