● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగతా ప్రాజెక్టులకు అరకొర నిధులు ● విద్యారంగం కేటాయింపులపై విద్యార్థి సంఘాల అసంతృప్తి ● సంక్షేమ పథకాల కొనసాగింపుపైనే ప్రభుత్వం దృష్టి ● ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా పోడు రైతులకు లబ్ధి | - | Sakshi
Sakshi News home page

● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగతా ప్రాజెక్టులకు అరకొర నిధులు ● విద్యారంగం కేటాయింపులపై విద్యార్థి సంఘాల అసంతృప్తి ● సంక్షేమ పథకాల కొనసాగింపుపైనే ప్రభుత్వం దృష్టి ● ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా పోడు రైతులకు లబ్ధి

Mar 20 2025 1:45 AM | Updated on Mar 20 2025 1:43 AM

ఆసిఫాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2025– 26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ఎదురైంది. గతేడాది మాదిరి ఈసారి కూడా అరకొర నిధులే కేటాయించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంపై మాత్రం దృష్టి సారించలేదు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఆశించిన కేటాయింపులు జరగలేదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరగనుంది. గిరిజన జనాభా అధికంగా ఉండటంతో పోడు రైతులకు పంపు సెట్లు అందించేందుకు ప్రవేశపెట్టిన ఇందిరా గిరి జల వికాసం పథకం ప్రయోజనకరంగా మారనుంది.

కేటాయింపులు ఇలా..

రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎకరాకు రూ.12 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ కింద జిల్లాలో 51,523 మంది రైతులకు రూ.465.84 కోట్లు అందించారు. అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించినా స్పష్టమైన బడ్జెట్‌ కేటాయింపులు లేవు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతిరోజూ సుమారు 26 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నట్లు అంచనా.. ఉచిత వంటగ్యాస్‌ పథకం కింద జిల్లాలో 73 వేల మందికి రూ.500కే గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 69,636 మందికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.2,146 కోట్లు చెల్లిస్తోంది. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కింద ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, తాజా బడ్జెట్‌లో 7.57 శాతం నిధులు కేటాయించడంపై విద్యార్థి సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

సాగునీటి ప్రాజెక్టులకు రూ.63.29 కోట్లు

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.63.29 కోట్లు కేటాయించారు. కుమురంభీం ప్రాజెక్టుకు రూ.24.44 కోట్లు(కేంద్ర, రాష్ట్ర పథకాలు కలిపి), వట్టివాగు ప్రాజెక్టు రూ.4.75, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు రూ.10.70 కోట్లు, ఎర్రవాగు ప్రాజెక్టు(పీపీరావు)కు రూ.1.2 కోట్లు కేటాయించారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన హామీల్లో ఒక్కటైన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్‌లో కేవలం రూ.32.2 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధులతో పనులు ముందుకు సాగ డం అనుమానమే.. ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వ్యవ‘సాయం’ కొనసాగింపు

వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24,439 కోట్లు కేటాయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 1.10 లక్షల మంది రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందనున్నారు. రైతుబీమా పథకం కింద గతేడాది జిల్లాలో 215 మంది రైతుల కుటుంబాలకు రూ.10.75 కోట్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసేలా రైతులకు పోత్సాహం అందించనున్నారు. రైతులకు టన్నుకు రూ.2 వేలు అదనంగా చెల్లించనున్నారు. పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5,734 కోట్లు కేటాయించగా, చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది. ఇందులో జిల్లాలో 1,39,782 మంది లబ్ధిదారులు ఉన్నారు.

వట్టివాగు ప్రాజెక్టు (ఫైల్‌)

● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగత1
1/1

● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement