ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫాక్స్‌కాన్ సంస్థ మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. పదో తరగ తి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన ని రుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని యు వతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో జాబ్‌మేళా నిర్వహించామని తెలిపా రు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అలీబిన్ అహ్మద్, గంధం శ్రీనివాస్, ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.