ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చేవారి సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ ని ర్మించాలని డీవైఎఫ్‌ఐ, టీఏజీఎస్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు టీకానంద్, కార్తిక్, మాలాశ్రీ మాట్లాడుతూ.. పబ్లిక్ టాయిలె ట్స్ లేక అత్యవసర సమయాల్లో జనం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. జన్కాపూర్, ఆసిఫాబాద్ బస్టాండ్ సమీపంలో ఓపెన్ జి మ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ త్వరలో బస్టాండ్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని, వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.


