ఆగని ఇసుక అక్రమ రవాణా
దహెగాం(సిర్పూర్): ‘మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు నిఘా పెట్టి దందాను అరికట్టాలి..’ ఆరు రోజుల క్రితం దహెగాం మండలానికి వచ్చిన సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా చెప్పిన మాటలివి.. అయినా కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. సీసీరోడ్ల నిర్మా ణం పేరుతో ఇష్టారీతిన తరలిస్తున్నారు. సెల వు రోజు కావడంతో అధికారుల దృష్టి నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆదివారం కొందరు సమీపంలోని పెద్దవాగు నుంచి పట్టపగ లే ఇసుక తరలించారు. వాగుల నుంచి ని త్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.


