బెజ్జూర్(సిర్పూర్): అటవీశాఖ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రైతులతో కలిసి జిల్లా అటవీశాఖ అధి కారి నీరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందించా రు. ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ని గ్రామాల్లో తాగునీటి బోర్లు వేసుకునే అవకా శం కల్పించాలన్నారు. హక్కుపత్రాలు ఉన్న రైతులు పత్తి కట్టే తీసేందుకు ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించి, రైతులు భూములు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సమస్యను ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఎఫ్‌వో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీ డుబ్బుల నాన్నయ్య, మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, నాయకులు పారుపల్లి పోశం, ఉమామహేష్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


