కౌటాల(సిర్పూర్): కౌటాల వారసంత, పశువుల సంత నిర్వహణ రుసుం వసూలు చేసేందుకు మంగళవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ అధ్యక్షతన వేలం నిర్వహించారు. వ్యాపారులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. కౌటాల వార సంతను రూ.7.25 లక్షలకు సదాశివపేట కాలనీకి చెందిన అనంతు ల సాయికృష్ణ దక్కించుకున్నారు. పశువుల సంత వేలం దాదాపుగా గంటకు పైగా సాగించిది. చివరికి కోయగూడ కాలనీకి చెందిన కు మురం సకారం రూ.28.45 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది నిర్వహించిన వేలంలో వారసంత రూ.4.20 లక్షలు, పశువుల సంత రూ.11 లక్షలు పలికింది. గతేడాదితో పోల్చి తే ఈసారి కౌటాల పంచాయతీకి రూ.20.37 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ ముత్యం రమేశ్ సమక్షంలో బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో ఎస్సై మధుకర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, మాజీ ఎంపీపీ విశ్వనాథ్, బీజేపీ జి ల్లా కార్యదర్శి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, మాజీ సర్పంచ్ మౌనిశ్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ పాల్గొన్నారు.


