ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ బార్ అ సోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది రాపర్తి రవీందర్ ఎన్నికయ్యారు. జిల్ల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి పీసీ జైన్, సహాయ ఎ న్నికల అధికారి నికోడే రవీందర్ పర్యవేక్షణ లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. బోనగిరి సతీశ్‌బాబు, రాపర్తి రవీందర్ పోటీ పడ్డారు. 46 ఓట్లు పోల్ కాగా, పది ఓట్ల మెజార్టీతో రవీందర్ విజయం సాధించారు. ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై న రవీందర్‌ను న్యాయవా దులు అభినందించారు. అలాగే ఉపాధ్యక్షుడిగా చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చరణ్, సంయుక్త కార్యదర్శిగా ఎల్.నగేశ్, కోశాధికారిగా మంథెన రామకృష్ణ, గ్రంథాల యం కార్యదర్శిగా కుమారం లాల్‌షా, మహిళా ప్రతినిధిగా ఆర్.గాయత్రీ మధురిమ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా కిశోర్‌కుమార్ ఎన్నికయ్యారు.


