● అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు
కాగజ్‌నగర్‌రూరల్: సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అ న్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. 2018లో మిల్లు పునఃప్రారంభమైనా ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. ఎ న్నికలు నిర్వహించకపోవడానికి గల కారణాలను కార్మికశాఖ, లేబర్ కమిషనర్ చెప్ప డం లేదన్నారు. కార్మికులను మిల్లు యాజ మాన్యం అరిగోస పెడుతుందన్నారు. మిల్లులో క్యాంటీన్ సౌకర్యం లేదని, కారణాలు లేకుండానే సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కమిషనర్‌తోపాటు మంత్రి శ్రీధర్‌బాబుకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మిల్లులో యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో ఈ ఏడాది ఏడు వేల మందికిపైగా మృతి చెందారని, హైవేలపై ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని మెడికల్ కళాశాలలకు ట్రామా కేర్ సెంటర్లను అనుసంధానం చేయాలని కోరారు.


