
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఆసిఫాబాద్: పాఠశాల విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్‌జడ్జి, డీఎల్‌ఏఎస్ సెక్రటరీ కే యువరాజ సూ చించారు. జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపూలే పాఠశాలలో విద్యార్థులకు నూతన చట్టాల గురించి వివరించారు. మహిళల రక్షణకు 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలి సి భోజనం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలును సందర్శించి ఖైదీల సమస్యలు తెలుసుకున్నారు. ప్రైవేట్ న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పూదరి నరహరి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్వర్లు, అంజనీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.