సూర్య భగవానుడికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment