గల్లీకో బెల్టు షాపు వెలుస్తోంది. వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలు బుట్టదాఖలవుతున్నాయి. గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా కొన్ని షాపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఖజానా నింపు కోగా.. కూటమి న | - | Sakshi
Sakshi News home page

గల్లీకో బెల్టు షాపు వెలుస్తోంది. వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలు బుట్టదాఖలవుతున్నాయి. గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా కొన్ని షాపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఖజానా నింపు కోగా.. కూటమి న

Published Mon, Feb 17 2025 1:05 AM | Last Updated on Mon, Feb 17 2025 1:01 AM

గల్లీ

గల్లీకో బెల్టు షాపు వెలుస్తోంది. వీధుల్లో మద్యం ఏరులై ప

సాక్షి, మచిలీపట్నం: మత్తు.. అనేక జీవితాలను చిత్తు చేస్తోంది. సంక్షేమ పథకాలను ఎత్తేసిన కూటమి ప్రభుత్వం.. అందుబాటులో మందు పథకంలా మద్యం దుకాణాలు తీసుకొచ్చింది. అధికారిక వైన్‌ షాపులకు అనుమతులిచ్చి.. కోట్ల రూపాయలతో ఖజానా నింపుకొంది.. విచ్చలవిడిగా అమ్మకాలకు తెరలేపింది. షాపులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు సిండికేట్‌తో చేతులు కలిపి, బెల్ట్‌ షాపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి, ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నారు. కొన్ని చోట్ల అమ్మకాలు అధికమైనట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్‌ షాపులకు మందు సరఫరా చేసేందుకు రూ.50వేల వరకు వసూలు చేయగా.. వాటిలో ప్రతి బాటిల్‌పై రూ.50 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల డోర్‌ డెలివరీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.

పచ్చని పల్లెల్లో..

పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన ప్రైవేటు మద్యం విధానంతో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. షాపులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు సిండికేట్‌ అయి కాసులతో జేబులు నింపుకుంటున్నారు. ఊరూరా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేయడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మండలం యూనిట్‌గా ప్రభుత్వం మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వగా.. ఒకే షాపుతో సంపాదన చాలదన్నట్లు బినామీలతో బెల్ట్‌ షాపులు పెట్టించి సొమ్ము చేసుకుంటున్నారు.

అధికారికంగా 123 దుకాణాలు..

జిల్లాకు అధికారికంగా 123 మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా 104 మద్యం షాపులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 123 షాపుల్లో నగర మునిసిపాలిటీల పరిధిలోని మచిలీపట్నంలో 5, పెడన–4, తాడిగడప–3, గుడివాడ–7 కాగా మిగిలినవి 104 మద్యం షాపులు మండలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకునే వీలు కల్పించారు. దీనికి తోడు గీత కార్మికులకు 12 షాపులు (10శాతం) కేటాయించగా.. ఇటీవలే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు.

1,200కు పైగా బెల్టు షాపులు..

గ్రామీణ ప్రాంత కొనుగోలుదారుల అవసరాలను ఆసరా చేసుకున్న కూటమి నేతలు బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సిండికేట్‌ సభ్యుల సహకారంతో 1,200కు పైగా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంటే అధికారిక షాపుల కంటే పదింతలు ఎక్కువగా బెల్ట్‌ షాపులున్నాయి. అయినా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు చర్యలకు సాహసించడం లేదు. గ్రామీణ ప్రాంతా లతో పాటు పట్టణాల్లోనూ బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీటి ఏర్పాటు కోసం రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ బెల్ట్‌ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే సుమారుగా.. మచిలీపట్నంలో 200, అవనిగడ్డ 140, పెడన 106, పామర్రు 215, గుడివాడ 100, పెనమలూరు 110, గన్నవరం 250 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఖజానాకు రూ.వందల కోట్లు..

మద్యం షాపుల ఫీజు రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా నగదు చేరింది. 123 షాపుల దరఖాస్తు ఫీజు రూ.58.84కోట్లు, లైసెన్స్‌ ఫీజులో 1/6 వంతు కింద రూ.11.52కోట్లు మొత్తం 70.36కోట్లు ఆరంభంలోనే వచ్చాయి. తరువాత విక్రయాలు, పన్నులు, పండగ, న్యూఇయర్‌ లాంటి సందర్భాల్లో రూ.వందల కోట్ల వ్యాపారాలు జరుగుతుండడంతో ప్రజా ధనం అంతా ఖజానాలో చేరుతోంది.

బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే చర్యలు..

బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయి. ఇప్పటికే తనిఖీలు చేపట్టాం. గత ఏడాది నవంబర్‌లో 134 కేసులు నమోదు చేసి, 138 మందిని అరెస్టు చేశాం. 5151.8 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌, 16.25 బీర్‌ కేసులు, రెండు వాహనాలు పట్టుకున్నాం. డిసెంబర్‌లో 58 కేసులు నమోదు చేసి, 60 మందిని అరెస్టు చేశాం. 266.25 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌, 35 బీర్‌ కేసులు, ఆరు వాహనాలు, జనవరిలో 64 కేసులు నమోదు చేసి, 64 మందిని అరెస్టు చేశాం. 134.46 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌, ఒక వాహనంపై కేసు పెట్టాం.

– సి. భార్గవ, ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌

సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గల్లీకో బెల్టు షాపు వెలుస్తోంది. వీధుల్లో మద్యం ఏరులై ప1
1/1

గల్లీకో బెల్టు షాపు వెలుస్తోంది. వీధుల్లో మద్యం ఏరులై ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement