ఉప్పొంగిన అభిమానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అభిమాన కెరటం ఉప్పొంగింది. జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమా నులు ఛేదించి తమ అధినేతకు నీరాజనాలు పట్టారు. అక్రమ కేసులో అరెస్టయి జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విజయ వాడ వచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో జైలు పరిసరాలు, గాంధీనగర్‌లో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. జైలు ఉన్న ఆంధ్రరత్న రోడ్డులో మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. జైలుకు వంద అడుగుల దూరం నుంచే అభిమానులను అడ్డుకున్నారు. హనుమాన్‌పేట లోని సిరివెళ్ల నర్సింగ్ హోం, తాలూకా ఆఫీస్ దక్షిణం గేటు, లేపాక్షి షోరూమ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రెస్‌క్లబ్ ఎదురుగా ఉన్న దుర్గా కళామందిరం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి జైలు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను వంద అడుగుల అవతలే నిలిపివేశారు. ఏ రోడ్డు చూసినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ముందుగా నిర్ణయించిన మార్గంలో కాకుండా, మరో దారిలో జైలు వద్దకు అనుమతించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు సమీపంలోకి రావడంతో ఒక్కసారిగా కార్య కర్తలు దూసుకొచ్చారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. తమ అభిమాన నేతను చూసేందుకు అనుమతివ్వాలని, తమపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పోలీసులను అభిమానులు నిలదీశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినా కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
అడుగడుగునా అభివాదం
పర్యటన ముగించుకొని వెళ్లే క్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా అభిమానులకు అభివాదం చేశారు. జైలు నుంచి న్యూ ఇండియ హోటల్ సెంటర్ వరకు ఐదారు చోట్ల ఆగి కారుపై నిలబడి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయనతో సెల్ఫీల కోసం కార్యకర్తలు ఎగబడ్డారు. జగన్ కారుపైకి వచ్చి అభివాదం చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పర్యటనలో పాల్గొన్న పలువురు నేతలు వల్లభనేని వంశీ అక్రమ అరెస్టుపై స్పందించారు.
గాంధీనగర్ ప్రశాంతతకు పెట్టింది పేరు. వంశీని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తుంటే ఆయనను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. పోలీసులు అనవసర ఆంక్షలు విధించారు. దారులన్నీ మూసి వేశారు. ప్రశాంత వాతావరణాన్ని పోలీసులే చెడగొడుతున్నారు. ఇది సరైన విధానం కాదు.
– మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే
ఈ ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ముందుకు వెళ్లడం లేదు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. మా నాయకుడు పరామర్శకు వస్తుంటే 144 సెక్షన్ విధించింది. ప్రభుత్వం ఏ ఒక్క పనీ చేయడంలేదు. డైవర్ట్ రాజకీయాలు చేస్తోంది. ప్రజాస్వామ్య విలువ లను కాపాడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు.
– కై లే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న సందేహం కలుగుతోంది. సత్యవర్థన్‌ను పోలీసులే కిడ్నాప్ చేశారు. అతని చేత బలవంతపు కేసు పెట్టారు. వల్లభనేని వంశీని ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు కేసు బనాయించారు.
– మొండితోక అరుణకుమార్, ఎమ్మెల్సీ
కూటమి ప్రభుత్వానిది కచ్చితంగా కక్ష సాధింపే. ప్రజలు అంతా గమనిస్తు న్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అడిగే వారి గొంతు నొక్కుతున్నారు. అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
– నలగట్ల స్వామి దాసు, మాజీ ఎమ్మెల్యే
వైఎస్ జగన్‌ను చూసేందుకు పోటెత్తిన అభిమానులు అడుగడుగునా ఆంక్షలు విధించి అడ్డుకున్న పోలీసులు ఆంధ్రరత్న రోడ్డులో మూడు చోట్ల బారికేడ్ల ఏర్పాటు ఆంక్షలను ఛేదించి నీరాజనం పలికిన ప్రజలు
దారులన్నీ మూసివేశారు
ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
కక్ష సాధింపు చర్యలు
చిన్నారి దేవికతో సెల్ఫీ
మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌కు చిన్నారి దేవిక రెడ్డి ఎదురుగా వచ్చింది. మేనమామతో కలిసి వచ్చిన చిన్నారి వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీసుకోవాలని కోరింది. దీంతో ఆ చిన్నారిని సిబ్బంది కారుపైకి ఎక్కించారు. జగన్ ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆమెను ఎత్తుకుని ముద్దాడి సెల్ఫీ దిగారు. జగన్‌ను కలిసిన బాలిక ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. జగన్ దగ్గరకు తీసుకోగానే చిన్నారి భావోద్వేగానికి గురైంది. ‘జగనన్న ఎత్తుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మొదటిసారి జగనన్నను చూశాను. నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆ బాలిక తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకుంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వస్తున్న అభిమానులను అడ్డుకుంటున్న పోలీసులు
పాలన చేతగాని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడు తోంది. ప్రజలు హామీలు అమలు చేయాలని అడుగుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజలను, వైఎస్సార్ సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తప్పుడు కేసులు నమోదు చేసి హామీల అమలు నుంచి తప్పుకొంటోంది. టార్గెట్ చేసి కేసులు పెడుతోంది. చేతనైతే మంచి పాలన ఇవ్వండి. అంతేగాని కక్ష సాధింపులకు పాల్ప డితే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.
– నందిగం సురేష్, మాజీ ఎంపీ
వల్లభనేని వంశీపై పెట్టిన కేసు పూర్తిగా అక్రమం. సత్యవర్థన్ కోర్టు ముందు హాజరై తనను ఎవరూ తిట్టలేదని అఫిడవిట్ ఇచ్చారు. నన్ను, పేర్ని నాని, వంశీ ఇలా కొందరిని అక్రమ కేసుల్లో ఇరికించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎలాగోలా జైల్లో పెట్టాలని కుట్రలు చేస్తోంది. అంతకంటే టీడీపీ నాయకులు ఏం చేయగలరు? అట్టుపెట్టిన వాళ్లకు అట్టున్నర ఉంటుంది. దేనికీ భయపడేది లేదు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాం. మాకు జగన్, పార్టీ కేడర్ అండగా ఉంది.
– కొడాలి నాని, మాజీ మంత్రి
ఉప్పొంగిన అభిమానం
ఉప్పొంగిన అభిమానం
ఉప్పొంగిన అభిమానం
ఉప్పొంగిన అభిమానం
ఉప్పొంగిన అభిమానం
ఉప్పొంగిన అభిమానం
ఉప్పొంగిన అభిమానం
Comments
Please login to add a commentAdd a comment