అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం
మైలవరం: క్రీడలతో విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని కృష్ణా జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సీజర్‌రెడ్డి పేర్కొన్నారు. మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు పోటీల్లో విజయవాడ నుంచి ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల, నూజివీడు నుంచి డీఏఆర్ కళాశాల, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లు ప్రాతినిధ్యం వహించాయి. ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు 16–11 స్కోర్‌తో విజయం సాధించి లీగ్ దశకు చేరుకుంది. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాల, నూజివీడు డీఏఆర్ కళాశాల, విజయవాడ కేబీఎన్ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల జట్లు లీగ్‌కు చేరాయి.
భూ సమస్యలపరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
తిరువూరు: పెండింగులో ఉన్న భూసమస్యల పరిష్కారానికి తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశా, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొని భూముల సమస్యలకు పరిష్కారం చూపారు. మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములుగా నమోదైన పట్టాభూములు అర్హులైన వారి భూములు పట్టాభూములు మార్చడంతోపాటు, సబ్ డివిజన్ చేసినప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో లేని రీసర్వే నంబర్లను నమోదు చేశారు. డివిజన్లోని పలు మండలాల నుంచి 45 మంది రైతులు దీర్ఘకాలంగా కోరుతున్న క్లిష్టమైన సమస్యలతో పాటు సర్వే సమస్యలను కూడా ఈ సందర్భంగా పరిష్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
శ్రీశైలానికి ఏపీటీడీసీ బస్
భవానీపురం(విజయవాడపశ్చిమ): శివరాత్రి సందర్భంగా ఏపీటీడీసీ రాజమండ్రి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 18 సీట్ల ఏసీ మినీ బస్ నడపనుంది. ఈ నెల 25న సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రిలో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడ హరిత బెరంపార్క్‌కు వస్తుంది. ఇక్కడి నుంచి పది గంటలకు బయలుదేరి 26వ తేదీ ఉదయం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుతుంది. మల్లన్న స్వామి దర్శనం తరువాత బస్సు తిరిగి బయలుదేరి 27వ తేదీ తెల్లవారు జాము రెండు గంటలకు విజయవాడ, సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. పెద్దలకు రూ.4,360, పిల్లలకు రూ.3,490గా చార్జ్జీ నిర్ణయించామని ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పీ) శేషగిరి తెలిపారు.
అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment