ఓపెన్ స్కూల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓపెన్ స్కూల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని, ఏ వన్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో అవకతవకలను అరికట్టాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని కోరుతూ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హరీష్ కుమార్, ఇతర ప్రతినిధులు డిస్ట్రిక్ట్ ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ వెంకటప్పయ్యకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరిధిలో వచ్చే నెలలో జరిగే టెన్త్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని కోరారు. ఏ వన్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో అవకతవకలను అరికట్టాలని, ఆ సంస్థలు విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో సొమ్మును కాజేస్తున్నాయని వివరించారు. అడ్మిషన్ ఫీజు రూ.2 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2 వేలు, ఎగ్జామ్ మేనేజ్‌మెంట్ పేరుతో రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కో ఆర్డినేటర్ వెంకటప్పయ్యను కలిసిన వారిలో బీసీఎస్‌ఎఫ్ నాయకులు నవీన్, శ్రీనివాసరావు, నాని తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment