రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
మొవ్వ: కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొవ్వ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్లకు పైబడిన గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధు రాలి తలకు తీవ్ర గాయమైంది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగి ఉంటుందని కూచిపూడి ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. వృద్ధురాలి వివరాలు తెలవాల్సి ఉందన్నారు. కొన్ని రోజులుగా మొవ్వ, కొడాలి మధ్య ఈ వృద్ధురాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు కూచిపూడి పోలీసులకు సమా చారం అందించాల్సిందిగా కోరారు. ఈ ప్రమా దంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment