విజయవాడస్పోర్ట్స్: జాతీయ పారా చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటుతున్నారని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.రామస్వామి తెలిపారు. ఈ నెల 17వ తేదీ చైన్నెలో ప్రారంభమైన 23వ పారా జాతీయ పోటీల్లో రాష్ట్ర జావెలిన్ క్రీడాకారుడు రొంగలి రవి ఎఫ్–40 విభాగంలో గోల్డ్ మెడల్, ఖలీషాబాషా బ్రాంజ్ మెడల్, 1500 మీటర్ల రన్నింగ్‌లో ఎస్.నవీన్ బ్రాంజ్ మెడల్ సాధించారని పేర్కొన్నారు. తొలి రోజు పోటీల్లోనే రాష్ట్రానికి మూడు పతకాలు అందించిన క్రీడాకారులను ఏపీ పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment