అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత స్వామివారికి చూర్ణోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతితో పంచాహ్నిక దీక్షతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. రాత్రి 10 గంటలకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి ఏకాంతసేవా మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. వసంతోత్సవ అనంతరం స్వామివారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment