
మహిళా హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా వర్సిటీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తమిళనాడులోని పెరియార్ విశ్వవిద్యాలయంలో ఈ నెల మూడు నుంచి జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయం జట్టు పాల్గొనబోతుందని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. కళాశాల నుంచి లోకేశ్వరి, సీహెచ్ ద్వారకేశ్వరి, టి.అరుణనాగదుర్గ, బి.సత్య, జి.మానస, వి.సుప్రియ, ఆంధ్ర లయోలా కళాశాల నుంచి డి.విజయలక్ష్మి, కె.గోత్రిని, బి.సుమశ్రీ, సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి వర్షిని, సీహెచ్ భవ్య శ్రీ, డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి ఎస్‌డీ జాస్మిన్, లీలపద్మజ, ఎస్‌పీఎంహెచ్ కళాశాల మచిలీపట్నం నుంచి మహాలక్ష్మి, వికాస్ కాలేజీ నుంచి కె.శ్రీవిద్య ఎంపికై నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment