
‘ఇంటర్’ పరీక్షలు ప్రారంభం
జిల్లాలో 24,323 మంది విద్యార్థులు హాజరు
చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. పరీక్షల కోసం జిల్లాలో 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల తర్వాత అనుమతించారు.
487 మంది గైర్హాజరు
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొదటి సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 24,810 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 24,323 మంది విద్యార్థులు హాజరయ్యారు. 487 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఇంటర్మీడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్‌రాజు చిలకలపూడి, మచిలీపట్నం పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం బందరులోని నేషనల్ కాలేజ్, హిందూ, పద్మావతి కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఏర్పాటుచేసిన మౌలిక వసతులు పరిశీలించి సూచనలు చేశారు. జిల్లాలోని మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల సభ్యులు 15 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్‌ఐవో సాల్మన్‌రాజు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment