కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Published Tue, Mar 4 2025 3:18 AM | Last Updated on Tue, Mar 4 2025 3:18 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 527.80 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది.

మహిళలను రక్షించుకుందాం..

చిలకలపూడి(మచిలీపట్నం): మహిళలను రక్షించుకుందాం, చదివించుకుందామని నినదిస్తూ మచిలీపట్నంలో సోమవారం అంగన్‌వాడీలు ర్యాలీ చేశారు.

పీహెచ్‌సీ తనిఖీ

పెనమలూరు: పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా వైద్యాధికారిణి శర్మిష్ఠ సోమ వారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు.

ఇఫ్తార్‌ సహరి

(మంగళ) (బుధ)

విజయవాడ 6.20 5.05

మచిలీపట్నం 6.19 5.03

జి.కొండూరు: ఎన్టీఆర్‌ జిల్లాలో మామిడి దిగుబడులు నేలచూపులు చూస్తున్నాయి. మార్కెట్‌లో కాయల లభ్యత లేకపోవడం, డిమాండ్‌ అధికంగా ఉండ టంతో ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. మిట్టగూడెం మార్కెట్లో ఆదివారం టన్ను బంగినపల్లి ధర రూ.1.20 లక్షలు పలికింది. అయితే దిగుబడులు లేకపోవ డంతో ఈ ధర కూడా గిట్టుబాటుకాదని రైతులు వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడి, ధరలో హెచ్చుతగ్గులు ఇలా ఏదో కారణంతో మామిడి రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. నష్టాలు తప్ప లాభాలు లేకపోవడంతో ఏడాదికేడాది మామిడి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడంతో పాటు తామర పురుగు ఉదృతి ఎక్కువై పూత రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి పూర్తిగా పడిపోవడంతో ధర అమాంతం పెరిగింది. పెరుగుతున్న ధరలు చూసి దిగుబడి లేక రైతులు లబోదిబో మంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

మూడేళ్లుగా నష్టాలు

ఎన్టీఆర్‌ జిల్లాల్లో పురుగులు, తెగుళ్ల వల్ల మామిడి దిగుబడి మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. జిల్లాల్లో సారవంతమైన నేలలు అధికంగా ఉండడంతో మామిడి చెట్లు 15 నుంచి 20 అడుగులు ఎత్తు పెరుగుతున్నాయి. దీని వల్లన రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలు ఉండటంలేదు. అంతే కాకుండా రైతులు పూర్వపు సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి మామిడి తోటలకు నీటి తడులు అధికంగా ఇస్తున్నారు. దీంతో నేలలో తేమ శాతం పెరిగి మామిడి చెట్లపై పురుగులు, తెగుళ్లు ఉధృతి ఎక్కువ అవుతోంది. మూడేళ్ల నుంచి జిల్లాలో తామర పురుగు, తేనె మంచు పురుగు, పేను వంటి పురుగుల ఉధృతితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

రెండు టన్నుల లోపే దిగుబడి

జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా ఎకరానికి రెండు టన్నుల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రకృతి సహకరిస్తే ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఎకరానికి దుక్కి, ఎరువులు, పురుగుమందులు, కూలీలు ఖర్చులు కలిపి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో పూత రాలిపోయి దిగుబడిలేక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో గత ఏడాది లక్షా 76వేల టన్నులకు పైగా మామిడి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి రావడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

7

మామిడి తోటలపై మంచు, తామర పురుగు దాడి ఫలితంగా సగానికి తగ్గిపోయిన కాయల దిగుబడి లభ్యతలేక అమాంతం పెరిగిన మామిడి ధర మిట్టగూడెం మార్కెట్లో బంగినపల్లి టన్ను ధర రూ.1.20 లక్షలు

న్యూస్‌రీల్‌

ఎన్టీఆర్‌ జిల్లాలో మామిడి సాగు వివరాలు

జిల్లాలోని పలు మండలాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. మండలాల వారీగా వత్సవాయిలో 165, జగ్గయ్యపేట 295, పెనుగంచిప్రోలు 244, నందిగామ 251, వీరులపాడు 113, మైలవరం 3,353, గంపలగూడెం 616, తిరువూరు 817, ఎ.కొండూరు 2,336, రెడ్డిగూడెం 4,450, విస్సన్నపేట 5,817, జి.కొండూరు 2,324, కంచికచర్ల 125, చందర్లపాడు 20, ఇబ్రహీంపట్నం 18, విజయవాడరూరల్‌ మండలంలో 1,952 హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి.

మిట్టగూడెంలో టన్ను ధర రూ.1.20 లక్షలు

రెడ్డిగూడెం మండలంలో మామిడి కోతలు ప్రారంభమ య్యాయి. మండలంలోని మిట్టగూడెం మ్యాంగో మార్కెట్‌లో ఆదివారం కాయల విక్రయాలు మొదలయ్యాయి. వ్యాపారులు అధిక ధరలు ఇస్తున్నారు. టన్ను బంగిన పల్లి ధర రూ.1.20 లక్షలు, తోతాపురి రూ.70 వేలు, రసాలు రూ.40 వేల చొప్పున కొనుగోలు చేశారు. మండలంలో 4,450 హెక్టార్లలో మామిడి సాగువుతుండగా రైతులే నేరుగా మామిడి కాయలను బొంబాయి, హైదరాబాద్‌, నాందేడ్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. నూజివీడు తర్వాత రెడ్డిగూడెం మామిడికి జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
కృష్ణాజిల్లా1
1/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/8

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement