
కొండపల్లి బొమ్మల కీర్తిని దేశానికి చాటుదాం
ఏపీ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి చెక్క బొమ్మల ఘనకీర్తి, చారిత్రక నేప థ్యాన్ని దేశానికి చాటి చెబుదామని రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. కొండపల్లిలోని బొమ్మల కాలనీ, బొమ్మల పరిశ్రమ కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. బొమ్మల తయారీదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. బొమ్మల తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపొనికి చెట్లు కనుమరుగయినట్లు తయారీదారులు ఆయనకు వివరించారు. తెల్లపొనికి చెట్లు వనాలు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. బొమ్మల తయారీలో యాంత్రీకరణ పద్ధ తులు అవలంబిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్ మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో కొండపల్లి బొమ్మల్ని కూడా పర్యాటకులకు చూపించే బాధ్యత పర్యాటక శాఖ తీసుకుంటుందని తెలి పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు టూరిజం ప్యాకేజీలో భాగంగా అమరావతితో పాటు దుర్గమ్మ ఆలయం, కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మలు, వాటర్ ఫాల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఏపీ టూరిజం శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment