56 మంది కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్లు
విజయవాడస్పోర్ట్స్: అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 56 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు హోం శాఖ కేటాయించింది. ఈ ఎస్‌ఐలు అందరూ సోమవారం విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్భ యంగా, నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో విధి నిర్వహణ చేయాలని వారికి సీపీ సూచించారు. బాధితులకు న్యాయం చేస్తూ, దోషులకు శిక్ష పడేలా పని చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో తలెత్తే సందేహాలపై ఉన్నతాధికారులు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు గౌతమి శాలి, తిరుమలేశ్వరరెడ్డి, కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment