ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్ష ‘ఇంగ్లిష్’ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 24,901 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 24,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. 495 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్‌రాజు మచిలీపట్నంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం డివిజన్ల పరిధిలో కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని మాల్‌ప్రాక్టీస్ జరగలేదని ఆర్‌ఐవో తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
మధురానగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాదంపాడుకు చెందిన మంత్రవాది సూర్య తేజ తండ్రి మురళీధర్ (62)మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వస్తున్నారు. పడవల రేవు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదరుగా వస్తున్న మరొక ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. కిందపడిపోయిన మురళీధర్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మురళీధర్ మృతిచెందారు. దీంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment