గీత కులాలకు మద్యం షాపులు కేటాయింపు
● మొత్తం 12 షాపులకు 286 దరఖాస్తులు ● ప్రక్రియ నిర్వహించిన జేసీ గీతాంజలిశర్మ
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో 10 శాతం మద్యం షాపులను గీత కులాల వారికి కేటాయించాలని సూచించటంతో జిల్లాలో 12 మద్యం షాపులకు ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ఆధారంగా గౌడ్, గౌడ, శెట్టిబలిజ కులాల వారికి ఈ షాపులను కేటాయించారు. మొత్తం 286 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున లాటరీ ప్రక్రియ ను గురువారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ లాటరీ ప్రక్రియ ద్వారా ఒక్కొక్క షాపునకు మూడు లాటరీలను తీశారు. మొదటిగా వచ్చిన దరఖాస్తుదారునికి షాపు కేటాయిస్తారు. ఒకవేళ మొదటి దరఖాస్తుదారుడు షాపు ఏర్పాటు చేసుకోలేకపోతే లాటరీలో 2 లేక 3వ స్థానాలు వచ్చిన దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. ఈ ప్రకారం లాటరీని జేసీ నిర్వహించారు.
12 షాపులు కేటాయింపు..
జిల్లాలోని 12 షాపులకు గెజిట్ నంబర్ ప్రకారం ఆ షాపునకు దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి వారి ముందు లాటరీ పద్ధతి ద్వారా షాపు కేటాయించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వై. శ్రీనివాసచౌదరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ భార్గవ్, బీసీ సంక్షేమశాఖాధికారి వి. రమేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి భారీ ఆదాయం..
లాటరీ ప్రక్రియ ద్వారా 286 దరఖాస్తు రాగా నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 5.72 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఎంపికై న దరఖాస్తుదారులు 1/4 వంతుగా రూ. 57 లక్షలు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment