అవనిగడ్డ: అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయం (ఎస్‌టీవో)లో పెద్ద ఎత్తున పెన్షనర్స్ నిధులు దారి మళ్లాయి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు జిల్లా అధికారులు రెండు రోజుల పాటు చేపట్టిన విచారణలో నిధులు స్వాహా వాస్తవాలని తేలినట్టు సమాచారం. శుక్రవారం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అధికారులు విచారణ చేశారు.
రూ.1.70 కోట్లు స్వాహా..
రిటైర్‌మెంట్ అయిన తరువాత ఉద్యోగులకు కమిటేషన్ బిల్స్ ఇస్తారు. 2023–24లో ఈ బిల్లుల చెల్లింపు పేరుతో రూ.1.70కోట్ల నిధులు ట్రెజరీ అధికారి, సిబ్బంది కలసి స్వాహా చేశారు. పెన్షనర్స్‌కు కమిటేషన్ బిల్స్ చెల్లింపు పేరుతో ఈ నిధులను ఎస్‌టీవీ, అకౌంటెంట్ తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. గత నెలలో జరిగిన ఆడిట్ అనంతరం కాగ్ ఈ విషయాన్ని ఏపీ సెక్రటేరియట్‌కు నివేదిక అందించింది. దీనిపై విచారణ చేపట్టాలని జిల్లా అధికారులకు సెక్రటేరియట్ అధికారులు ఆదేశించడంతో బుధ, గురువారాల్లో స్థానిక ట్రెజరీ కార్యాలయంలో అధికారులు విచారణ చేశారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విచారణ చేశారు.
అవనిగడ్డ ఎస్టీవో కార్యాలయంలో రూ.1.70 కోట్లు స్వాహా కాగ్ నివేదికతో వెలుగులోకి బాగోతం రెండు రోజులుగా గుట్టుగాకొనసాగుతున్న విచారణ
గుట్టుగా విచారణ..
2023–24కు సంబంధించి జరిగిన ఈ అవినీతిని ఎస్‌టీవో గుట్టు చప్పుడు కాకుండా ఉంచారు. జిల్లా అధికారులు పలుసార్లు తనిఖీలు చేసినా ఈ విషయం చెప్పకుండా, బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కాగ్ నివేదికలో బయట పడటంతో విచారణకు ఆదేశించారు. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో ఎస్‌టీవో ఆదిశేషు, అకౌంటెంట్ వెంకట్ ఈ నిధులను స్వాహా చేసినట్టు సమాచారం. ఈ విషయమై జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం విచారణ కొనసాగింది. ఈ విషయమై జిల్లా అధికారులను వివరణ కోరగా విచారణ చేస్తున్నామని ఎంత మేర అవినీతి జరిగిందనే విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment