No Headline
గుడ్లవల్లేరు: దేశ చరిత్రలో అరుదైన పురస్కారం ఇటీవల కృష్ణాజిల్లా పరిషత్‌కు లభించింది. జెడ్పీ ఎంతో పారదర్శకంగా పరిపాలన సాగించిందని చెప్పేందుకు ఐసీఏఐ ఇచ్చిన ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. ఈ అవార్డు పొందడంలో జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉప్పాల హారిక కృషి ఎంతో ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెరసి 778 జిల్లాలు ఉన్నాయి. ఈ జాతీయ అవార్డును ఇంతవరకు దేశంలో ఏ జిల్లా పరిషత్‌కు ఇవ్వలేదు. 2023 ఆర్థిక సంవత్సరం కింద జిల్లా పరిషత్‌కు ఆర్థిక నివేదికలను ఉత్తమంగా నిర్వహించినందుకు గాను కేంద్ర స్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) వారు ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌కు అరుదైన ఉత్తమ జాతీయ పురస్కారాన్ని ఇచ్చింది. గత నెల ఒకటో తేదీన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము దంపతులు ఢిల్లీలోని కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్‌కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment