
భక్తుల కల్పవల్లి ‘అద్దంకి నాంచారమ్మ’
కోడూరు: అద్దంకి నాంచారమ్మ అమ్మవారు ప్రధాన జాతరోత్సవాలకు విశ్వనాథపల్లి ముస్తాబవుతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవదాయశాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి ప్రధాన జాతర నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. నాంచారమ్మ అమ్మవారు అద్దంకి గ్రామం నుంచి రావడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు అమ్మవారి పుట్టింటి వారుగా భక్తులు భావిస్తారు. దీంతో ఆ రెండు జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భక్తుల సౌకర్యం కోసం మచిలీపట్నం, రేపల్లె, అవనిగడ్డ నుంచి ‘విశ్వనాథపల్లి స్పెషల్’ పేరుతో 15 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని రంగులు, విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 13న నాంచారమ్మ మూలమూర్తికి ప్రత్యేక అలంకారం, 14న ఆలయ ప్రధాన గుడి జాతర, 15న అమ్మవారికి నైవేద్యాల సమర్పణ చేస్తామని దేవదాయ అధికారులు తెలిపారు.
13 నుంచి ప్రధాన జాతరోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment