కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Published Sun, Mar 9 2025 2:40 AM | Last Updated on Sun, Mar 9 2025 2:40 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
సమ్మర్‌ జిమ్‌..

–8లోu

ఇఫ్తార్‌ సహరి

(ఆది) (సోమ)

విజయవాడ 6.21 5.02

మచిలీపట్నం 6.20 5.00

బరువు తగ్గడానికి ఇదే సరైన సమయం కొన్ని సమ్మర్‌ చిట్కాలతో నాజూగ్గా..

యోగా, వాకింగ్‌, జాగింగ్‌లకు అనుకూలం

లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభ మైంది. జిమ్‌ చేయడానికి సిద్ధమవుదాం.

నడక ఎంతో ప్రయోజనం

ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్‌ వాక్‌ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్‌ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్‌ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్‌ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి.

శీతల ప్రాణాయామం

● శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

● నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఆహారం మేలు

● పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

● శీతల పానీయాలు, షుగర్‌ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి.

● వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్‌ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి.

ఎయిరోస్పేస్‌లో గుడ్లవల్లేరు విద్యార్థులకు కొలువులు

గుడ్లవల్లేరు: దేశానికి గర్వకాణమైన ఎయిరోస్పేస్‌ కంపెనీ ‘రొసెల్‌ టెక్సిస్‌ లిమిటెడ్‌’లో రూ.3 లక్షల వార్షిక వేతనంతో 23మంది గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్‌ వీవీఆర్‌ఎస్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ సంస్థ ఏపీలో క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించిన ఏకై క పాలిటెక్నిక్‌ కాలేజీ తమదే కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులను, ప్రత్యేక శిక్షణను ఇచ్చిన అధ్యాపకులను కళాశాల చైర్మన్‌ నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ సత్యనారాయణరావు, కో – సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ రామకృష్ణ అభినందించారు.

7

న్యూస్‌రీల్‌

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యాన శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 3కే రన్‌ ర్యాలీ నిర్వహించారు. దీన్ని కలెక్టర్‌ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమిషాలి, కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్‌ ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థుల డప్పు కళా ప్రదర్శన, చిన్నారుల స్కేటింగ్‌, మహిళా పోలీస్‌ (డ్రోన్‌ పైలెట్స్‌) డ్రోన్‌ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాల సాకారానికి మహిళల పాత్ర చాలా ముఖ్యమన్నారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలే మహిళా శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ మహిళల భద్రతకు నిరంతరం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి శక్తి అనే మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా ఆవిష్కరించడం జరుగుతోందన్నారు. డీసీపీ గౌతమి షాలి మాట్లాడుతూ ప్రస్తుతం చదువు, ఉద్యోగం..ఇలా ఎందులోనైనా అందరూ సమానమేనన్నారు. డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ భద్రమైన వాతావరణం లక్ష్యంగా పోలీస్‌ కమిషనరేట్‌ భిన్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

వాకింగ్‌, జాగింగ్‌, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్‌ చేయకూడదు. ఎండలో వాకింగ్‌ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

– డాక్టర్‌ టీవీ మురళీకృష్ణ, జనరల్‌ ఫిజీషియన్‌

ఆహార నియమాలు పాటించాలి

వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్‌గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులు

ఇవి పాటిస్తే..

బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్‌ మంచి వ్యాయామం

ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు

వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది

రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment
కృష్ణాజిల్లా1
1/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా9
9/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా10
10/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా11
11/12

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా12
12/12

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement